: ఏపీకి పలు పార్టీల బాసట... రాజ్యసభలో ఏకాకిగా మారిన బీజేపీ!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరుగుతున్న వేళ బీజేపీ ఏకాకిగా మారింది. ఈ చర్చలో పాల్గొన్న ప్రతి పార్టీ ఆంధ్రప్రదేశ్ కు బాసటగా నిలిచింది. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతి పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా కావాలని నినదించిన వేళ... టీడీపీ నేతలు బీజేపీని వెనుకేసుకుని రాగా, ఇతర పార్టీలన్నీ కేంద్రాన్ని నిందించాయి. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. అన్ని పార్టీలు అంతిమంగా అభిప్రాయపడింది ఏంటంటే... ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రధాని ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ముక్తకంఠంతో నినదించడం విశేషం.