: ఏపీ ప్రత్యేకహోదాపై మొదలైన చర్చ... సెక్షన్లను చదివి వినిపిస్తున్న జైరాం రమేష్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ మొదలైంది. ఈ సందర్భంగా యూపీఏ అధికారంలో ఉండగా ఏపీకి చట్టంలో ప్రతిపాదించిన అంశాలను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ చదివి వినిపించారు. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టం సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఆరు ప్రమాణాలు చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని కోరారని, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు ఇస్తున్న అదనపు నిధులు కూడా మంజూరు చేయాలని, అలాగే పన్ను రాయితీలు ఇవ్వాలని కోరారు. బుందేల్కండ్ కు కల్పిస్తున్న సౌకర్యాలు ఏపీకి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అన్నారు. ప్రధాని ఆరు హామీలు ఇస్తే... అందులో రెండు హామీలు మాత్రమే బీజేపీ నెరవేర్చేదిశగా అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News