: పరీక్షలకు 2, 3 రోజుల ముందు విద్యార్థులకు ప్రశ్నపత్రాలు... ఎంసెట్-2 లీకేజీపై సీఐడీ ప్రకటన
తెలంగాణ ఎంసెట్-2 లీకేజీపై సీఐడీ ప్రకటన చేసింది. రెండు సెట్ల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని తెలిపింది. సుమారు ఐదు నగరాల్లో విద్యార్థులకు శిబిరాలు ఏర్పాటు చేశారని పేర్కొంది. పరీక్షలకు 2, 3 రోజుల ముందు విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇచ్చారని, 320 ప్రశ్నలు, వాటికి సమాధానాలను విద్యార్థులకు ఇచ్చారని తెలిపింది. హైదరాబాద్, ఏపీ, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించినట్లు చెప్పింది. విష్ణుధర్ అలియాస్ విష్ణువర్ధన్, తిరుమల్ అలియాస్ తిరుమల అనే నిందితులను గుర్తించినట్లు పేర్కొంది. వీరిద్దరు 25 మంది విద్యార్థులను బెంగళూరుకు తీసుకెళ్లారని చెప్పింది. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని, రేపు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపింది.