: 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణలో న్యాయాధికారులు ఇటీవల చేపట్టిన ఆందోళనల సమయంలో పదకొండు మందిపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనలో జాప్యం, న్యాయాధికారుల నియామకాల్లో అన్యాయం, ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్ ల అంశాలను ప్రశ్నిస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగిన విషయం విదితమే.