: టీమిండియా క్రికెటర్ హర్భజన్ తండ్రయ్యాడు
టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ తండ్రయ్యాడు. హర్భజన్ భార్య గీతా బాస్రా నిన్న లండన్ లోని ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ తల్లి అవతార్ కౌర్ మీడియా ద్వారా వెల్లడించారు. తల్లీబిడ్డ లిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కొడుకు, కోడలికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని అవతార్ కౌర్ చెప్పారు. అయితే, తనకు కూతురు పుట్టిన శుభవార్తపై హర్భజన్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. హర్భజన్, గీతా బస్రాల వివాహం జలంథర్ లో అక్టోబర్ 29, 2015న జరిగింది.