: నాలుగు గంటల్లో తెలంగాణ టూర్ ను ముగించనున్న మోదీ... పర్యటన పూర్తి వివరాలు
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్న వేళ, ఆయన షెడ్యూల్ వివరాలు వెల్లడయ్యాయి. ఆగస్టు 7న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ చేరుకునే మోదీ, లాంఛన స్వాగత సత్కారాల అనంతరం గజ్వేల్ కు ప్రయాణమవుతారు. అక్కడ మిషన్ భగీరథ పైలాన్ ను ప్రారంభించిన అనంతరం 4:15 గంటలకెల్లా హైదరాబాద్ చేరుకుంటారు. ఆపై 5 గంటలకు స్థానిక బీజేపీ నేతలతో సమావేశమై కొంతసేపు మాట్లాడి తిరిగి 7 గంటల సమయంలో న్యూఢిల్లీకి బయలుదేరుతారు. దీంతో మోదీ తెలంగాణ పర్యటన కేవలం నాలుగు గంటలకు మాత్రమే పరిమితం కానుంది.