: ఐ ఫోన్ రికార్డు... వందకోట్ల అమ్మకాలు
యాపిల్ సంస్థ నుంచి విడుదలైన హైఎండ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఐ ఫోన్ల అమ్మకాలు వందకోట్లను దాటాయి. ఈ విషయాన్ని ‘యాపిల్’ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా వెల్లడించారు. కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా టిమ్ కుక్ మాట్లాడుతూ, ఐ ఫోన్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 100 కోట్ల ఫోన్లను విక్రయించామని, గతవారం ఈ మైలు రాయిని చేరుకున్నామని చెప్పారు. ఇటీవలే వంద కోట్ల యూనిట్ ఐ ఫోన్ ను విక్రయించామన్నారు. స్మార్ట్ ఫోన్ చరిత్రలోనే ‘ఐ ఫోన్’ది చాలా ప్రత్యేకమని, ప్రపంచాన్ని మార్చగలిగే ఫోన్ గా ఇది మారిందని కుక్ పేర్కొన్నారు.