: ఓన్లీ గజ్వేల్, మరేమీ లేదు...!: మోదీ పర్యటనపై పీఎంఓ నుంచి సీఎంఓకు సమాచారం


భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పర్యటించాలని నిర్ణయించిన వేళ, ఆయన కేవలం గజ్వేల్ లో మాత్రమే పర్యటిస్తారని, మరెక్కడా ఎలాంటి కార్యక్రమాలూ లేవని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం పీఎంఓ నుంచి కేసీఆర్ కార్యాలయానికి అధికారికంగా సమాచారం అందింది. ఆగస్టు 7న మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించేందుకు నరేంద్ర మోదీ అంగీకరించారన్న సంగతి తెలిసిందే. ఆయన రాక సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించి మోదీని అతిథిగా ఆహ్వానించాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే, మోదీ మరే అధికారిక కార్యక్రమంలో పాల్గొనేది లేదని పీఎంఓ ఇప్పుడు స్పష్టం చేసింది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ల్యాండయ్యే మోదీ, ఆపై హెలికాప్టర్ లో గజ్వేల్ వెళ్లి, తిరిగి బేగంపేటకు వచ్చి న్యూఢిల్లీకి పయనమవుతారని పీఎంఓ వెల్లడించింది.

  • Loading...

More Telugu News