: తమిళ స్టార్ విజయకాంత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ పై సుప్రీంకోర్టు స్టే
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై ప్రభుత్వ న్యాయవాది పరువు నష్టం దావా వేయగా, పలుమార్లు విచారణకు గైర్హాజరైన విజయకాంత్ పై నాన్ బెయిలబుల్ వారంటును తిరుపూర్ కోర్టు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయకాంత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన ధర్మాసనం ఎన్బీడబ్ల్యూపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించి తాత్కాలిక ఊరటను కలిగించింది.