: నిర్మాత కేఎస్ రామారావును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం
ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ సెంటర్ ఆధ్వర్యంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం కుప్పకూలిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, రామారావును అరెస్ట్ చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భవనం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మరణించగా, పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమతి తీసుకోకుండానే భవన నిర్మాణం చేపట్టిన క్లబ్ అధ్యక్షుడు కేఎస్ రామారావు, కార్యదర్శి రాజశేఖరరెడ్డిలకు నోటీసులిచ్చి విచారించిన సంగతి తెలిసిందే. ఘటన వెనుక వారి తప్పిదం కూడా ఉందని పోలీసు వర్గాలు నిర్థారించిన నేపథ్యంలో అరెస్ట్ చేయవద్దంటూ రామారావు హైకోర్టును ఆశ్రయించారు.