: ఏసీబీ చార్జ్ షీట్ లో నిమ్స్ మాజీ డైరెక్టర్, వైద్యుల పేర్లు
హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (నిమ్స్) లో వైద్య పరికరాల కొనుగోళ్ల అవకతవకలకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఈరోజు చార్జ్ షీట్ దాఖలు చేసింది. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ అవినీతికి పాల్పడ్డారని ఆ చార్జ్ షీట్ లో ఏసీబీ పేర్కొంది. పరికరాల కొనుగోలు నిమిత్తం నిర్వహించిన రూ.10 కోట్ల టెండర్లలో రూ.3.14 కోట్ల మేరకు అవినీతి జరిగిందని పేర్కొంది. ధర్మరక్షక్ తో పాటు నిమ్స్ వైద్యులు ముకుందరెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, వికాస్ కన్నా పేర్లను కూడా ఆ చార్జ్ షీట్ లో ఏసీబీ చేర్చింది.