: ఇండిగో విమానంలో ఐఎస్ఐఎస్‌కు అనుకూల నినాదాలు.. ముంబయికి దారి మళ్లింపు
దుబాయ్-కొచ్చి ఇండిగో విమానాన్ని ఈరోజు ముంబయి ఎయిర్‌పోర్టు వైపుగా దారి మళ్లించాల్సి వచ్చింది. 89 మంది ప్రయాణికులతో వెళుతోన్న విమానంలో ఈరోజు ఓ వ్యక్తి ఐఎస్ఐఎస్ కి అనుకూల నినాదాలు చేసి అలజడి సృష్టించాడు. దీంతో ఫైలట్ ఆ విమానాన్ని ముంబయికి మళ్లించాడు. ఎయిర్‌పోర్టుకి ఇండిగో విమానం చేరుకోగానే నినాదాలు చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకి అప్పజెప్పారు. నినాదాలు చేసిన వ్యక్తి విమానంలో వికృత చేష్టలు కూడా చేసినట్లు సమాచారం.