: వేశ్యావాటికల్లోని ప్రజలకే అధిక సంతోషం: కాలిఫోర్నియా వర్శిటీ అధ్యయనం


రెడ్ లైట్ ఏరియా... తమ పొట్టపోసుకోవడం కోసం పడుపు వృత్తిని ఎంచుకుని దుర్భర జీవితం సాగిస్తూ, విటుల కోసం వేచి చూస్తూ కాలం గడుపుతుండే వేశ్యల కుటుంబాలు ఉండే ప్రాంతం. ఎంతో మందికి ఈ పేరు వింటేనే చిరాకు కలుగుతుంది. ఇక ఇలాంటి చోట నివాసముండే ప్రజలు మిగతా ప్రాంతాల్లోని ప్రజలతో పోలిస్తే మరింత ఆనందంగా ఉన్నారట. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ ఎమిలీ కూపర్ 18 దేశాల్లో ఉన్న రెడ్ లైట్ ప్రాంతాల్లో ఓ స్టడీని నిర్వహించి తయారు చేసిన రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నిత్యమూ అత్యంత బిజీగా ఉండటం, ఈ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు కూడా లాభదాయకంగా సాగడంతోనే తమ జీవితాలు సాఫీగా, సంతోషంగా సాగుతున్నాయని అధ్యయనంలో పాల్గొన్న అత్యధికులు చెప్పినట్టు ఎమిలీ కూపర్ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చి పోయే విటులు, వారి కోసం రోడ్లపై ఉండే యువతులను చూస్తూ ఎంతసేపైనా టైమ్ పాస్ చేయవచ్చని కూడా పలువురు వెల్లడించారట. ఇక్కడ నిత్యమూ పోలీసుల నిఘా ఉంటుంది కాబట్టి నేరాలు, ఘోరాలు ఉండవని, భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారట. స్టడీలో పాల్గొన్న అతి కొద్దిమంది మాత్రమే తమ ప్రాంతం నుంచి వేశ్యా వాటికలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు ఎమిలీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News