: సినీ నటుడు 'రాజా'లా అందరూ విధిగా ఆస్తిపన్ను చెల్లించాలన్న సర్పంచ్
సినీ నటుడు రాజాలా తమ ఇంటి ఆస్తిపన్నును విధిగా చెల్లించాలని గ్రామ సర్పంచ్ హరికృష్ణ కోరారు. స్వయంగా బండ్లగూడ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన రాజా, సాయినగర్ కాలనీలోని తమ ఇంటి పన్నును నిన్న చెల్లించారు. ఇంటి యజమానులు తమ ఆస్తిపన్ను చెల్లించి మరింత మెరుగైన సేవలు పొందాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు. మార్చి నెల చివరి రోజు వరకు ఆగకుండా ముందుగానే ఆస్తి పన్ను చెల్లించాలని ఆయన కోరారు.