: డబ్బుల్లేక బెంజ్ కారును అమ్మేసిన పవన్ కల్యాణ్... కోడైకూస్తున్న సినీ వర్గాలు!
వరుస ఫ్లాపులతో పాటు 'సర్దార్ గబ్బర్ సింగ్' నిర్మాణంలో పాలుపంచుకోవడం, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పవన్ కల్యాణ్, తానెంతో ఇష్టపడి కొనుక్కున్న మెర్సిడిస్ బెంజ్ జీ 55 కారును విక్రయించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ వివాహ సమయంలో ఇదే కారులో అతనిని పవన్ కల్యాణ్ స్వయంగా కల్యాణ వేదికకు తీసుకువచ్చారు కూడా. దీని విలువ దాదాపు రూ. 2 కోట్లు కాగా, మరో కారును కొనాలని ఆయన భావించి ఉంటే, ఆ పని చేసిన తరువాతే దీన్ని విక్రయించేవారని, పవన్ కారు కొనలేదు కాబట్టి ఇబ్బందుల వల్లే దీన్ని అమ్మేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా, ఈమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టు పవన్ స్వయంగా చెప్పడం గమనార్హం.