: రేపు నిత్యావసర ధరల పెరుగుదలపై లోక్ సభలో చర్చ... ప్రసంగించనున్న రాహుల్


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రేపు లోక్‌ సభలో ప్రసంగించనున్నారు. రేపు పార్లమెంటులో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ జరగనుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. దీంతో పెరుగుతున్న నిత్యావసర ధరలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కీలకమైన ఈ అంశంపై లోక్ సభలో ఆయన ప్రసంగించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతవారం ధరల పెరుగుదలపై ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ గతవారం మాట్లాడుతూ, ధరలపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందని, దీనిపై మంత్రులు బాధ్యత వహించేలా నిరసనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రసంగం ఆసక్తి రేపుతోంది.

  • Loading...

More Telugu News