: సీఐడీ నివేదిక ఇచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం: లక్ష్మారెడ్డి


ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజీపై తెలంగాణ సీఐడీ చేస్తున్న దర్యాప్తు పూర్తయిన తరువాత అందజేసే నివేదికను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్-2 లీకేజీపై దర్యాప్తు ముగిసిన తరువాత సీఐడీ అధికారులు పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇస్తారని అన్నారు. ఈ నివేదిక అందిన తరువాత దానిని పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎంసెట్-2పై నిర్ణయం కూడా అప్పుడే తీసుకుంటామని ఆయన తెలిపారు. తొందరపడవద్దని, సీఐడీ పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తోందని, వాస్తవాలు వెల్లడవుతాయని ఆయన సూచించారు. అంతవరకు వేచి చూడాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News