: బంగాళాఖాతంలో శకలాలు కనిపించాయి: ఏఎన్-32 విమానంపై మనోహర్ పారికర్
ఆరు రోజుల క్రితం బంగాళాఖాతంపై అదృశ్యమైన భారత వాయుసేన విమానం (ఏఎన్-32) ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలిస్తూనే ఉన్నాయి. ఏఎన్-32 సముద్రంలో కూలి ఉంటుందని భావిస్తున్న ప్రాంతంలో తాజాగా కొన్ని శకలాలు కనిపించాయని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈరోజు మీడియాకు తెలిపారు. అయితే అవి ఏఎన్-32 విమానానివో కాదోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విమానం ఆచూకీ గురించి భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, అయినా దాని గురించి కచ్చితమైన నివేదికలు లేవని ఆయన వ్యాఖ్యానించారు.