: ముస్లింలలో పేదలు ఎక్కువగా ఉన్నారు... వారి అభివృద్ధి బాధ్యత నాదే!: చంద్రబాబు
ముస్లింలలో పేదలు ఎక్కువగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు విజయవాడ వన్‌టౌన్‌లో షాదీఖానా నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ముస్లింలను అన్ని రంగాల్లో పైకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వారి అభివృద్ధి బాధ్యతను తమ భుజాన వేసుకుంటామని ఆయన అన్నారు. ముస్లింలు వెనకబడి ఉన్నారని సచార్ కమిటీ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసేందుకు తాము ఉర్దూ అకాడమీకి అనుమతిచ్చినట్లు ఆయన తెలిపారు.