: నాగార్జునతో నటించాలని ఉందా? ...అయితే, మీ వివరాలను పంపాల్సిన ఈ-మెయిల్ ఐడీ ఇదిగో!
టాలెంట్, నటించాలనే ఆసక్తి ఉన్న ఔత్సాహిక నటులకు యువసామ్రాట్ నాగార్జున ఒక మంచి అవకాశం కల్పించారు. తనతో కలసి నటించాలనుకునే వారు తమ వివరాలను talent@annapurnastudios.com అనే ఐడీకి మెయిల్ చేయాలని పేర్కొన్నారు. నటనపై ఆసక్తి ఉన్న ఏ వయసు వారైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని నాగ్ చెప్పారు. అయితే, ఏ చిత్రం కోసం నటులను తీసుకుంటారనే విషయాన్ని మాత్రం నాగార్జున వెల్లడించలేదు. ఇదిలా ఉంచితే, ప్రముఖ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించారు. హథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కూడా నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.