: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 300 మందికి అతిసారం


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో అతిసారం ప్రబలింది. ఈ వ్యాధి విజృంభించడంతో సుమారు 300 మంది ప్రజలు అతిసారం బారిన పడ్డారు. పారిశుద్ధ్యం లోపం కారణంగా అక్కడ అతిసారం వేగంగా విస్తరిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. అతిసారం కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారందరికీ వైద్యం అందిస్తున్నామని, అతిసార నియంత్రణకు మున్సిపాలిటీ అధికారులకు సూచనలు చేశామని వైద్యులు తెలిపారు. అయితే పాలకొండ పరిసరాల్లో పారిశుద్ధ్యంకై చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News