: వంట మనిషిని వేధించిన ప్రిన్సిపల్ ను పీకేసీన కలెక్టర్!


ప్రజలలోని మూఢ నమ్మకాలు పోగొట్టడంలో ఉన్నతాధికారుల పాత్ర, చొరవ చాలా అవసరమని హేతువాద నాయకులు సూచిస్తుంటారు. బీహార్ లోని ఔరాంగాబాద్ జిల్లా కలెక్టర్ మూఢాచారాన్ని పారదోలే ప్రయత్నంలో ఓ స్కూలు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఔరంగాబాద్ కు 45 కిలోమీటర్ల దూరంలోని ఓ పాఠశాలలో ఉర్మిళా కువర్ (36) అనే దళిత మహిళ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వంటి చేసిపెడుతుంది. మూడేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. దీంతో వితంతువైన నువ్వు భోజనం వండడానికి వీల్లేదని ప్రిన్సిపాల్ అభ్యంతరం చెప్పాడు. కాళ్లా వేళ్ల పడడంతో పది వేల రూపాయలు ఇస్తే వండేందుకు అనుమతిస్తానని ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆమె జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) కన్వాల్ తనూజ్ ను కలిసి, జరిగిన సంగతి వివరించింది. దీంతో విషయం మొత్తం విన్న కన్వాల్ తనూజ్ మరుసటి రోజు 45 కిలోమీటర్ల దూరంలోని ఆ గ్రామానికి ఆమెను తీసుకెళ్లి... ఆమె చేత వంట చేయించి, ఇతర అధికారులతో కలిసి కింద కూర్చుని ఆ భోజనాన్ని ఆమెనే వడ్డించమని అందరూ కలసి తిన్నారు. అనంతరం ఆమెను విధుల్లో చేర్చి, ప్రిన్సిపల్ ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలిచ్చి వెళ్లారు. కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News