: ట్రంప్ ను గెలిపించేందుకు పుతిన్ ప్రయత్నం?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ను గెలిపించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారంటూ అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ట్రంప్ ను గెలిపించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధామిచ్చిన బరాక్ ఒబామా...ఏదైనా సాధ్యమేనని అన్నారు. గత వారం హ్యాకర్లు డెమొక్రటిక్ నేషనల్ కమిటీ డాటాను దొగిలించేందుకు ప్రయత్నించారు. ఇది రష్యా నిఘా వర్గాల హ్యాకర్ల పని అని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని వికీ లీక్స్ మెయిల్స్ కూడా నిర్ధారిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మిత్రుడైన ట్రంప్ ను గెలిపించేందుకు పుతిన్ కుట్రలు పన్నుతున్నారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.