: హైదరాబాద్‌లో భారీ వర్షం... పలు చోట్ల ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మలక్‌పేట్, గోషామహల్, చాదర్‌ఘాట్, ఆర్టీసీ క్రాస్ రోడ్‌స్, ఇందిరాపార్క్, దోమల్ గూడ, ముషీరాబాద్, అంబర్‌పేటలో భారీ వర్షం పడింది. యూసఫ్‌గూడ్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై నిలిచిన నీటితో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సమాచారం.