: ‘హోదా’ బిల్లు చర్చకు వస్తే సభలో ఉంచాల్సిన అంశాలపై చర్చించాం: సుజనా చౌదరి
కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటికే చాలా సాయం అందిందని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. టీడీపీ పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో సంతృప్తి ఉన్నప్పటికీ పలు విషయాల్లో అసంతృప్తి అలాగే ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఏపీ ప్రత్యేక హోదా అంశం ఒకవేళ చర్చకు వస్తే దానిపై అనుసరించాల్సిన వ్యూహాలపై, సభలో ఉంచాల్సిన అంశాలపై తాము చర్చించామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా అంశంలో తమపై చేస్తోన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకునే విధంగా తమ పార్టీ కృషి చేస్తోందని ఆయన చెప్పారు.