: రాజస్థాన్ లో టోల్ గేట్ ఉద్యోగిని చితక్కొట్టిన బీజేపీ ఎంపీ, సహచరులు.. ఆ వీడియో ఇదిగో!
టోల్ గేట్ రుసుం చెల్లించకుండా వెళుతున్న బీజేపీ ఎంపీ వాహనాన్ని అడ్డుకున్న ఉద్యోగిని సదరు ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు చితక్కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని భరత్ పూర్ బీజేపీ ఎంపీ బహదూర్ సింగ్ కోలీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో భరత్ పూర్ లోని టోల్ గేట్ వద్ద రుసుం చెల్లించకుండా ఆయన వాహనం వెళుతుండగా, అక్కడి ఉద్యోగి ఆ వాహనాన్ని ఆపాడు. దీంతో, సదరు ఎంపీ, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఇద్దరు పోలీసులు అక్కడ ఉండగానే ఆ ఉద్యోగిపై దాడి చేశారు. ఈ వ్యవహారమంతా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో బయటకు రావడం.. సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఎంపీపై విమర్శలు వర్షం కురుస్తోంది.