: వైఎస్సార్సీపీలో మనోవేదన అనుభవించాను: ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు


తాజాగా టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలో ఉండగా తాను మనోవేదన అనుభవించానని, అక్కడ పనిచేసేవారికి గుర్తింపు ఉండదని వాపోయారు. మనోవేదన భరించలేకే వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరానని చెప్పారు. రాజమండ్రిలోని వైఎస్సార్సీపీ నేతలకు తనను విమర్శించే అర్హత లేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుతోనే నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అప్పారావు అభిప్రాయపడ్డారు. కాగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆదిరెడ్డి టీడీపీలో ఇటీవల చేరారు.

  • Loading...

More Telugu News