: సముద్రంలో చేపల కోసం వల విసిరితే పల్సర్ బైక్ పడింది!
అవును... మీరు చదివింది నిజమే. సముద్రంలో వేటకు వెళ్లిన తమిళనాడు జాలర్ల వలలో పల్సర్ బైక్ పడింది. మనల్ మేల్ కుడి కృష్ణరాజపట్టినం చేపల రేవు నుంచి 200 మంది నాటు పడవల్లో 10 నాటికల్ మైళ్ల దూరం వెళ్లి చేపలు పడుతున్న వేళ, తమ వలలో ఏదో బరువైనదే చిక్కిందని తెలుసుకున్న మహమ్మద్, సుల్తాన్ అనే జాలర్లు దాన్ని అతి కష్టం మీద పైకి లాగారు. ఎరుపు రంగు పల్సర్ బైక్ ను చూసి సముద్ర తీర భద్రతాదళానికి సమాచారం అందించారు. బైకుకు నంబర్ ప్లేటు లేదని గమనించిన వారు, అక్రమ రవాణా కోసం దీన్ని తీసుకువస్తూ, గస్తీ దళాల నిఘాను చూసిన ఎవరో సముద్రంలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బైక్ ఇంజన్, చాసిస్ నంబర్ ఆధారంగా బైక్ ఎవరిదన్న విషయాన్ని విచారిస్తున్నట్టు వెల్లడించారు.