: 'పోకేమాన్ గో' ఆటగాళ్లకూ ఇన్స్యూరెన్స్ వచ్చేసింది!


దురదృష్టవశాత్తూ ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్థిక భరోసా కోసం బీమా సదుపాయం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న 'పోకేమాన్ గో' ఫీవర్ లో పడి ఎంతో మంది ప్రమాదాలకు గురవుతుంటే, ఈ ఆట ఆడేవారికి బీమా సదుపాయం కల్పిస్తామంటూ ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ ఆటను ఆడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, అంతే స్థాయిలో ప్రమాదాలు జరుగుతుండటంతో రష్యాకు చెందిన 'ఎస్బర్ బ్యాంక్' గేమ్ ఆడే స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ఇన్స్యూరెన్స్ ఇవ్వడానికి రెడీ అయింది. తమ దేశ వాసులు గాయాలపాలైతే 50 వేల రూబుల్స్ వరకూ చెల్లిస్తామని, నామమాత్రపు ప్రీమియంతో ఈ సదుపాయం పొందవచ్చని వెల్లడించింది. ఓ స్మార్ట్ ఫోన్ గేమ్ కు ఉన్న క్రేజ్ ను వ్యాపారంగా మలచుకునే దిశగా బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన తొలి సంస్థగా 'ఎస్బర్ బ్యాంక్' నిలిచింది.

  • Loading...

More Telugu News