: షుగర్ ఫ్యాక్టరీలో 'వేయి పడగలు'... బెంబేలెత్తిన కార్మికులు!


ఒకట్రెండు పాములు ఒకేచోట కనిపిస్తేనే బెంబేలెత్తిపోయే పరిస్థితుల్లో తమిళనాడులోని ఓ కర్మాగారం పరిసరాల్లో వెయ్యి పాములను పట్టుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... చెన్నై దగ్గర్లో గల మధురాంతకంలో పట్టాలం అనే ప్రాంతంలో పురాతనమైన సహకార చక్కెర కర్మాగారం వుంది. ఆ కర్మాగారంలో కార్మికులు మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. ఆ కర్మాగారం చుట్టూ పచ్చిక బయళ్లు, చెట్లు ఉండడంతో నిత్యం పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. ఈ కర్మాగారంలో ఉన్నట్టుండి పాములు ప్రత్యక్షమయ్యాయి. ఒకట్రెండు కనిపిస్తే పెద్దగా భయపడేవారు కాదేమో కానీ కర్మాగారం లోపల, బయట ఎక్కడ చూసినా పాములే పాములు... దీంతో యాజమాన్యం అటవీశాఖ సిబ్బంది, పాములు పట్టేవారిని రంగంలోకి దించింది. వీరంతా కలిసి సుమారు వెయ్యి పాములను పట్టుకుని గోనెసంచుల్లో కట్టేశారు. వీటిలో రకరకాల జాతులకు చెందిన సర్పాలు ఉన్నాయని, విష సర్పాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. వీటన్నింటినీ రైల్లో తీసుకెళ్లి సుదూర అడవుల్లో విడిచి పెడతామని అటవీశాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News