: సముద్రంలో తేలియాడుతున్న రెండు నారింజ రంగు డ్రమ్ములు... విమానం ఆచూకీపై పురోగతి?
ఐదు రోజుల క్రితం చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయల్దేరి, బంగాళాఖాతంలో మిస్సయిన విమానం వెతుకులాటలో పురోగతి కనిపించినట్టు తెలుస్తోంది. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో రెండు నారింజరంగు డ్రమ్ములను నేవీ సిబ్బంది గుర్తించారు. ఈ రెండు డ్రమ్ములు చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు వెళ్తూ జాడలేకుండా పోయిన విమానానివేనని వారు భావిస్తున్నారు. నారింజరంగులో ఉన్న ఈ రెండు డ్రమ్ములు కూలిపోయిందని భావిస్తున్న విమానానికి చెందినవేనని, ఆ విమానం కోసం బంగాళాఖాతంలో గాలిస్తున్న ఎయిర్ఫోర్స్, నేవీ సిబ్బంది బలంగా నమ్ముతున్నారు. అయితే ఆ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది మరణించి ఉంటారని వారు భావిస్తున్నారు.