: శ్రీకాకుళం జిల్లాలో పక్షి గుడ్ల కోసం విద్యుత్ స్తంభం ఎక్కిన పాము.. పాముపై దాడి చేసిన ప‌క్షులు


పక్షి గుడ్ల కోసం ఓ పాము విద్యుత్ స్తంభం పైకి ఎక్కింది. అయితే ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన‌ ప‌క్షులు పాముపై దాడి చేసి దానిని పొడిచాయి. ఈ సంఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లాలోని న‌ర‌స‌న్న పేట‌లో తాజాగా చోటుచేసుకుంది. త‌రువాత గుడ్ల కోసం ప్ర‌య‌త్నాలు ఆపేసిన పాము స్తంభాన్ని దిగేందుకు నానా తంటాలు ప‌డింది. గుడ్ల‌పై ఆశ‌తో పాము స్తంభంపైకి గబగబా ఎక్క‌గ‌లిగింది కానీ, మ‌ళ్లీ దాని పైనుంచి కింద‌కి దిగ‌డానికి సుమారు గంట‌న్న‌ర ప‌ట్టింది. ఈ చిత్రాలన్నీ అక్కడి ఓ కెమెరా కంటికి చిక్కాయి.

  • Loading...

More Telugu News