: ‘మల్లన్న సాగర్’ ఆపే ప్రసక్తే లేదు: మంత్రి పోచారం
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపమని, అసలు ఆ ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ప్రాజెక్టులపై ప్రతిపక్షాల కుట్ర చేస్తున్నారని, మంచి పనులకు అడ్డు తగిలితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టులు పూర్తయి నీళ్లొస్తే ప్రజలు ప్రశ్నిస్తారనే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ప్రాజెక్టుల కోసం ఎక్కడా కూడా బలవంతపు భూ సేకరణకు పాల్పడలేదని, ప్రజలే స్వచ్ఛందంగా భూములిస్తున్నారని పోచారం పేర్కొన్నారు.