: చినకాపవరంలో వింత వ్యాధి.. అకస్మాత్తుగా పడిపోయిన ఏడుగురు విద్యార్థులు
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు భయం గుప్పిట్లో బడికి వస్తున్నారు. బడిలోకి అడుగుపెట్టగానే వారిని వింత వ్యాధి ఎటాక్ చేస్తోంది. గత నెల రోజులుగా ఆ పాఠశాల విద్యార్థులు సృహతప్పి పడిపోతోన్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు కూడా మళ్లీ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పాఠశాలలో ఈరోజు మధ్యాహ్నం ఏడుగురు విద్యార్థులు అకస్మాత్తుగా పడిపోయారు. దీని పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.