: కోహ్లీకి కానుక ఇచ్చిన దిగ్గజ క్రికెటర్ తనయుడు


టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కుమారుడు మాలి రిచర్డ్స్ ఒక పెయింటింగ్ ను కానుకగా ఇచ్చాడు. టెస్టు మ్యాచ్ ల సిరీస్ నిమిత్తం టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ లో ఉన్న విషయం తెలిసిందే. తొలిటెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీని వివియన్ రిచర్డ్ర్స్ సహా పలువురు ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిచర్డ్స్ కుమారుడు మాలి రిచర్డ్స్ కోహ్లీ బొమ్మ వేసి ఉన్న ఒక పెయింటింగ్ ను అందజేశాడు. తండ్రి రిచర్డ్స్, వ్యాపార భాగస్వామి దోన్ హోవెల్ తో కలిసి మాలి అక్కడికి వెళ్లాడు. కోహ్లి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నానని, ఆంటిగ్వాలో టెస్టు ఆడేందుకు వస్తున్న కోహ్లీ కోసం ఎదురుచూశామని, అంతేకాకుండా, కోహ్లీ డబుల్ సెంచరీ చేయడంతో ఈ చిరు కానుకను ఆయనకు అందజేశానని చెప్పిన మాలి, కోహ్లీకి అభిమాని కూడానట.

  • Loading...

More Telugu News