: నల్గొండలో బంద్ నిర్వహిస్తోన్న విద్యార్థి సంఘాల నేతలపై కాలేజ్ ప్రిన్సిపాల్ దాడి
నల్గొండ జిల్లాలో విద్యార్థి సంఘాలు ఈరోజు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే పలుచోట్ల బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. బంద్ పట్టించుకోకుండా హుజుర్‌నగర్‌లోని ఓ కాలేజ్ యాజమాన్యం తరగతులు నిర్వహిస్తుండడంతో కాలేజీలో ఏబీవీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారిపై సదరు కాలేజీ ప్రిన్సిపాల్ దాడికి దిగారు. కార్యకర్తలు తెచ్చుకున్న జెండా కర్రను లాక్కొని మరీ ఓ విద్యార్థి నేతను ప్రిన్సిపాల్ చితకబాదారు. ఆయన చేసిన ఎటాక్‌తో విద్యార్థి సంఘాల నేతలందరూ అక్కడి నుంచి పరారయ్యారు.