: లోకల్ ట్రైన్ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన విద్యార్థి


ఊహించని ప్రమాదంలో ఒక యువకుడు తన రెండు కాళ్లు కోల్పోయాడు. ఢిల్లీ లో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ రెండో సంవత్సరం చదువుతున్న అంకుర్ అనే వ్యక్తి నిన్న లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి ఒకరు అతన్ని ట్రైన్ లో నుంచి తోసేశాడు. ఈ సంఘటనలో అంకుర్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News