: ఏఎన్‌-32 విమాన గాలింపు కోసం రంగంలోకి దిగిన మారిష‌స్ స్పెష‌ల్ షిప్ ‘సాగ‌ర్ నిధి’


ఐదు రోజుల క్రితం బంగాళాఖాతంపై అదృశ్యమైన భారత వాయుసేన విమానం (ఏఎన్‌-32) ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ విమానం సముద్రంలో కూలి ఉంటుందని భావిస్తున్న ప్రాంతంలో గాలింపు కోసం మారిష‌స్ నుంచి తెప్పించిన‌ స్పెష‌ల్ షిప్ ‘సాగ‌ర్ నిధి’తో అధికారులు గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. అత్యాధునిక ప‌రికాల‌తో రూపొందించిన‌ సాగ‌ర్ నిధి స‌ముద్రంలోని 6 కిలో మీటర్ల లోతున ఉన్న వ‌స్తువుల‌ను గుర్తించగ‌ల‌ద‌ని, ధ్వ‌ని త‌రంగాల ద్వారా వ‌స్తువులను ప‌సిగ‌డుతుందని అధికారులు తెలిపారు. విమాన ఆచూకీ కోసం గాలిస్తోన్న అధికారుల‌కు ఇప్ప‌టికీ చిన్న క్లూ కూడా దొర‌క‌లేదు. మ‌రోవైపు జ‌లాంత‌ర్గాముల ద్వారా విమానాన్ని క‌నిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News