: మల్లన్నసాగర్‌కు వెళుతోన్న కాంగ్రెస్ నేత‌ల అరెస్ట్‌.. పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్త‌త‌


మెదక్ జిల్లాలో నిర్మించనున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ హైద‌రాబాద్‌లోని గాంధీభ‌వ‌న్ నుంచి మల్లన్నసాగర్‌కు వెళుతోన్న కాంగ్రెస్ నేత‌లను పోలీసులు అరెస్టు చేశారు. తాము అనుకున్న విధంగానే ‘చలో మల్లన్న సాగర్’ యాత్రను కాంగ్రెస్ నాయ‌కులు కొద్ది సేప‌టి క్రితం ప్రారంభించారు. అయితే అక్క‌డ మోహ‌రించిన పోలీసులు వారిని వెంట‌నే అడ్డుకొని, అరెస్టు చేశారు. భ‌ట్టి విక్ర‌మార్క‌, గండ్ర వెంకటరమణారెడ్డి, జ‌గ్గారెడ్డి, మ‌ల్లు ర‌వి స‌హా ప‌లువురు నేత‌లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌మ‌కు నిర‌స‌న తెలిపే హ‌క్కు కూడా లేదా? అంటూ కాంగ్రెస్ నేత‌లు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత‌లు, పోలీసుల‌కి మ‌ధ్య తోపులాట జ‌రిగింది.

  • Loading...

More Telugu News