: హిల్లరీ క్లింటన్ గెలవకుంటే నాశనమే: బెర్నీ శాండర్స్
డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి బరిలోకి దిగాలని భావించి, హిల్లరీ క్లింటన్ కు ప్రాథమిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి వెనుకబడిపోయిన బెర్నీ శాండర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అమెరికాకు హిల్లరీ అధ్యక్షురాలు కావాలని, ఆమె రాకుంటే దేశం నాశనమవుతుందని అన్నారు. "ఆమె ఆలోచనా ధోరణి, నాయకత్వ లక్షణాలు, ట్రంప్ కన్నా మెరుగ్గా ఉంటాయి. ఆమె తప్పనిసరిగా తదుపరి అధ్యక్షురాలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు, వాటికి పరిష్కారాల గురించి ఆమెకు బాగా తెలుసు" అని బెర్నీ వ్యాఖ్యానించారు.