: ఆడవాళ్లు పరువు హత్యలు మొదలుపెడితే మగాళ్లకు మూడినట్టే: బాలీవుడ్ నటుడు అలీ జాఫర్
పాకిస్థాన్ మోడల్ కందిల్ బలోచ్ హత్యపై బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ తీవ్రంగా స్పందించాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. ఆడవాళ్లు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పరువు హత్యలు చేయడం అంటూ మొదలుపెడితే మగాళ్లకు మూడినట్టేనని, చాలా మంది చనిపోతారని ఆ ట్వీట్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పాకిస్థాన్ కు చెందిన అలీ జాఫర్ బాలీవుడ్ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని, అక్కడ మంచి ప్రతిభ కలిగిన కళాకారులు ఉన్నారని అలీ జాఫర్ పేర్కొన్నాడు.