: ఇకపై నీతా అంబానీకి ‘వై’ కేటగిరీ భద్రత
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి ‘వై’ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘వై’ కేటగిరీ భద్రత నిమిత్తం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండోలు ఆమెకు రక్షణ కల్పిస్తారు. పదిమంది సీఆర్పీఎఫ్ సాయుధ కమాండోలతో ఒక ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. కాగా, నీతా అంబానీకి ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐఎం), కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారంతో ఆమెకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ నుంచి ప్రమాదం పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో నీతూ అంబానీ భర్త ముఖేశ్ కు మూడేళ్ల క్రితమే ప్రభుత్వం ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించింది.