: రియోకు ముందు దెబ్బ మీద దెబ్బ... డోపీగా తేలిన షాట్ పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్
రియో ఒలింపిక్స్ కు ముందు ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి దొరికిపోయి, విశ్వ క్రీడా సంగ్రామానికి దూరం కాగా, తాజాగా మరో క్రీడాకారుడు డోపీగా దొరికిపోయాడు. షాట్ పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ సైతం ఉత్ప్రేరకాలు వాడినట్టు వెల్లడైంది. గత నెల 22న నిర్వహించిన డోప్ పరీక్షల్లో ఆయన పట్టుబడ్డాడు. ఆపై 'బీ' శాంపిల్ పరీక్షల్లోనూ అదే ఫలితం వచ్చింది. రియోలో జరిగే షాట్ పుట్ విభాగంలో ఇంద్రజిత్ పాల్గొనాల్సి వుంది. డోపీగా పట్టుబడటంతో, ఆయనిక బ్రెజిల్ పయనమయ్యే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు.