: పపువా న్యూగినియాలో భారీ భూకంపం!
ఈ తెల్లవారుఝామున పపువా న్యూగినియాలో భారీ భూకంపం వచ్చింది. అడ్మిరాల్టీ ఐ దీవుల కేంద్రంగా 5:38 గంటల సమయంలో 6.3 తీవ్రతతో వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ భూకంప కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ ద్వీపం చుట్టూ 4 వేల కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉందని, దీని కారణంగా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణ అధికంగా ఉన్నందునే తరచూ భూకంపాలు వస్తున్నాయని తెలిపారు. భూకంపం కారణంగా పసిఫిక్ మహా సముద్రంలో సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇంకా ఎటువంటి సమాచారమూ అందలేదు.