: ‘గ్రేటర్‌’లో ప్రయాణికులు కోరుకున్న రూట్లలో బస్సు సర్వీసులు: గ్రేటర్ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం


గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కొత్త రూట్లలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం నిర్వహించిన ‘డయల్ ఆర్టీసీ’ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. 300 పాత బస్సులను రీడిజైనింగ్ చేస్తున్నామని, ఒక్కో బస్సుకు రూ.8 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్ ఆర్టీసీ పరిధిలోని ప్రయాణికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు చెప్పిన ఆయన వారు కోరుకున్న కొత్త రూట్లలో బస్సులు నడుపుతామన్నారు. అలాగే బస్తీల అసోసియేషన్ల కోరిక మేరకు కాలనీలకు బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. డయల్ ఆర్టీసీ సందర్భంగా పురుషోత్తం ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News