: ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని కోర్టుల్లో బట్టబయలు చేస్తా: నాగం


తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట జరుగుతున్న అవినీతిని కోర్టులో బట్టబయలు చేస్తానని బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట అవినీతికి పాల్పడుతోందని, ఈ పార్టీ నిజస్వరూపాన్ని, దోపిడీని బయట పెడతానని హెచ్చరించారు. కేవలం గుత్తేదారుల జేబులు నింపేందుకు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు డిజైన్‌ ను మార్చారని ఆయన మండిపడ్డారు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులనే విచక్షణ కూడా లేకుండా మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై లాఠీచార్జ్ చేయించడం అమానుషమని ఆయన పేర్కొన్నారు. ఈ దారుణ లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News