: మన రాష్ట్రం, మన పాలనంటూ పోలీసులతో కొట్టిస్తారా?: మండిపడ్డ జగ్గారెడ్డి
మన రాష్ట్రం, మన పాలన అంటూ పోలీసులతో ప్రజలను కొట్టిస్తారా? అంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘మల్లన్న సాగర్’ నిర్వాసితులకు న్యాయం చేయకపోతే మంత్రి హరీశ్ రావును జిల్లాలో అడుగుపెట్టనివ్వమని ఆయన హెచ్చరించారు. ‘మల్లన్న సాగర్’ కు ఎనిమిది గ్రామాల రైతులు ఒప్పుకుంటే వారు ఆందోళనకు ఎందుకు దిగుతారని ఆయన ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే ఉద్యమం ఆగదని జగ్గారెడ్డి అన్నారు.