: పగడపు దిబ్బల కోసం ప్రయత్నం... భారీ నౌకను ముంచేశారు!


అమెరికాలోని అందమైన ఫ్లోరిడా పంపానో బీచ్‌ లో వందలాది మంది గుమికూడారు. అంతా ఆసక్తిగా కళ్లప్పగించి చూస్తున్నారు. ఇంతలో ఫుట్ బాల్ స్టేడియం అంత సైజున్న 'లేడీ లక్‌' అనే నౌక అక్కడ మునిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అధికారులు, సిబ్బంది, నిపుణులు అంతా కలసి దానిని ముంచేశారు. ఇంతకీ, అంత పెద్ద నౌకను ఎందుకు ముంచేశారో తెలుసుకుందాం. పంపానో బీచ్ అందమైన పగడపు దిబ్బలతో అలరారుతుంది. పర్యావరణ కాలుష్యం కారణంగా ఇవి అంతరించిపోతున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోరల్ రీఫ్స్ సహజసిద్ధంగా ఏర్పడడం మందగించింది. దీంతో మరిన్ని పగడపు దిబ్బలను ఏర్పాటు చేయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.] దీనికి పరిష్కారంగా 1967లో తయారైన 'లేడీ లక్' నౌకను పంపానో తీరానికి కిలోమీటరు దూరంలో ముంచేసింది. దీంతో కొన్నాళ్ల తర్వాత దీనిపై పగడపు దిబ్బలు ఏర్పడతాయని వారు అంచనా వేస్తున్నారు. అందుకే నిపుణుల పర్యవేక్షణలో దీనిని ముంచేసినట్టు తెలిపింది. దీని మునక గురించి ముందుగానే తెలుసుకున్న ప్రజలు దానిని వీక్షించేందుకు సముద్రం ఒడ్డున భారీ ఎత్తున గుమికూడారు.

  • Loading...

More Telugu News