: మురళీ ధరన్ పై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసిన శ్రీలంక!


శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ పై శ్రీలంక జట్టు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. మురళీపై క్రికెట్ ఆస్ట్రేలియాకు శ్రీలంక ఫిర్యాదు చేయడమేంటనే అనుమానం వచ్చిందా?...మురళీధరన్ ఆస్ట్రేలియా జట్టకు స్పిన్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న తొలిటెస్టు జరగనున్న పల్లెకిలె స్టేడియంలో పిచ్ ను తయారు చేస్తుండగా, మురళీధరన్ అక్కడికి చేరుకున్నాడు. దీంతో స్టేడియం నిర్వాహకులు మురళీని అడ్డుకున్నారు. దీంతో వారిని దురుసుగా తోసుకుంటూ లోపలికి వచ్చిన మురళీధరన్ శ్రీలంక టీమ్ మేనేజర్ చరితా సేననాయకేతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో మురళీధరన్ పై శ్రీలంక బోర్డు అధ్యక్షుడు తిలంగా సుమతిపాల క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేశారు. ఒక జట్టుకు కన్సల్టెంట్ గా ఉన్న వ్యక్తి, మరోజట్టు పిచ్ లు రూపొందించేటప్పుడు రావడం నిబంధనలకు విరుద్ధమని ఆ ఫిర్యాదులో పేర్కొన్న సుమతిపాల, మురళీ ఇలా ప్రవర్తిస్తాడని భావించలేదని పేర్కొన్నారు. ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలని ఆయన సీఏకు సూచించారు.

  • Loading...

More Telugu News