: నువ్వు మర్యాదస్తుడివి కాదు జాఫర్... కాపురాల్లో చిచ్చు పెట్టేలా ఉన్నావ్!: టీవీ9 యాంకర్ తో ఆనం వివేకానందరెడ్డి


టీవీ9 యాంకర్ జాఫర్ నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు నేత ఆనం వివేకానందరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనంకు పెళ్లి కాకముందు ఉన్న లవ్ ఎఫైర్ పై ప్రశ్నించగా "దణ్ణం పెడతానయ్యా నీకు. ఎందుకయ్యా నన్ను సతాయిస్తావ్. నాయబ్బా... ఎందుకు నా తండ్రా... ఇట్లాంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇరికించడం తప్ప ఏమైనా ఉందా? పెండ్లికి ముందు ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకయ్యా?" అన్నారు. ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు ప్రేమించలేదన్న ప్రశ్నకు, "ఎందుకయ్యా దాని విషయాలు ఇప్పుడు. కాపురాల్లో చిచ్చు పెట్టే రకమయ్యా నువ్వు. నువ్వు మర్యాదస్తుడివి కాదయ్యా జాఫర్. నిజంగానే... కాపురంలో, మా కొంపల్లో చిచ్చు పెట్టడానికి నెల్లూరు వచ్చావు. అన్నీ నిజాలే చెబుతానంటే, ఇలాంటి ప్రశ్నలా అడిగేది?" అంటూ తనదైన శైలిలో చలోక్తులు విసిరారు. తాను మాట్లాడటం మొదలు పెడితే, అమ్మాయి ఎలా ఉందంటావు, పొడుగా? పొట్టా? అని అడుగుతావు. ఎందుకయ్యా ఈ ప్రశ్నలు అంటూ తప్పించుకున్నారు.

  • Loading...

More Telugu News